YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎన్నార్సీ ప్రక్రియను జమ్ముతోపాటు మిజోరంలో చేపట్టే దమ్ముందా? బీజేపీకి అసదుద్దీన్ ఒవైసీ సవాల్

ఎన్నార్సీ ప్రక్రియను జమ్ముతోపాటు మిజోరంలో  చేపట్టే దమ్ముందా?         బీజేపీకి అసదుద్దీన్ ఒవైసీ సవాల్
జాతీయ పౌరసత్వ జాబితా (ఎన్నార్సీ)పై  ఎంఐఎం పార్టీ అధినేత - ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఎంఐఎం పార్టీ మాజీ అధ్యక్షుడు ఫక్రె మిల్లత్ మౌల్వీ అబ్దుల్ వాహెద్ ఒవైసీ వర్ధంతి సందర్భంగా జరిగిన బహిరంగసభలో అసదుద్దీన్ మాట్లాడారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి వచ్చే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో లాభం పొందడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఎన్నార్సీ పేరుతో హల్ చల్ చేస్తున్న బీజేపీ అదే ప్రక్రియను జమ్ముకశ్మీర్ తోపాటు మిజోరంలో  చేపట్టే దమ్ముందా? అని సవాల్ విసిరారు. అసోంలో 40 లక్షల మందిని చొరబాటుదారులుగా గుర్తించినట్టు ఎన్నార్సీ ముసాయిదా జాబితాలో పేర్కొనడాన్ని వారిని అక్కడినుంచి తరిమేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొనడాన్ని ఓవైసీ తప్పుపట్టారు. బంగ్లాదేశ్ లో జన్మించిన త్రిపుర ముఖ్యమంత్రి కూడా చొరబాటుదారడని ప్రకటించే సాహసం కేంద్రం చేయగలదా? అని ప్రశ్నించారు. జాతీయపార్టీలకు కాలం చెల్లిందని రానున్న ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకపాత్ర పోషించనున్నాయని చెప్పారు. హైదరాబాద్ లోక్ సభతోపాటు - ఏడు ఎమ్మెల్యే సీట్లు గెలుస్తామని ఆయన ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ - బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వచ్చి ప్రచారం చేసినా సికింద్రాబాద్ లో బీజేపీని ఓడించి తీరుతామన్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా మోడీని రాహుల్ గాంధీ అలింగనం చేసుకోవడాన్ని తప్పుపట్టిన ఒవైసీ.. అవిశ్వాసం అంటే ఆలింగనం చేసుకోవడమేనా? అని ప్రశ్నించారు. అదే తాను మోడీతో కరచాలనం చేస్తే చాలు బీజేపీతో మజ్లిస్ కలిసిపోయిందని కాంగ్రెస్ నేతలే దుష్ప్రచారం చేస్తారని ఎద్దేవా చేశారు. 70 ఏల్ల క్రితమే పాకిస్తాన్ ఆహ్వానాన్ని తిరస్కరించి జిన్నా రమ్మన్నా పట్టించుకోకుండా ఈ దేశ పౌరులుగానే ఉండిపోతామని స్పష్టం చేశామని గుర్తుచేశారు. 

Related Posts