YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆనం ఫ్యామలీ రిప్లేస్ చేసే పనిలో తెలుగుదేశం

ఆనం ఫ్యామలీ రిప్లేస్ చేసే పనిలో తెలుగుదేశం
వైసీపీ పట్టు ఉన్న ఆ జిల్లాలో బలపడేందుకు టీడీపీ ఎంతగానో ప్రయత్నిస్తోంది. అందుకోసం ఆ పార్టీ రూపొందించుకున్న ప్రణాళికలు సక్సెస్ అయ్యే పరిస్థితుల్లో ఆ పార్టీకి చెందిన ఓ కీలక నేత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయనే నెల్లూరు జిల్లాలో బలమైన నేతగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి. కొద్దిరోజుల క్రితం అధికార టీడీపీకి గుడ్‌బై చెప్పారు. అంతేకాదు, వైసీపీలో చేరేందుకు మహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. కొద్దిరోజుల కిందట వైసీపీ అధినేత జగన్‌తో భేటీ అయిన ఆనం.. ఆ పార్టీలో చేరేందుకు మార్గం సుగుమం చేసుకున్నారు. అయితే, ముహూర్తానికి ప్రాధాన్యమిచ్చిన ఆయన ఆషాడ మాసంలో కాకుండా శ్రావణ మాసంలో వైసీపీ కండువా కప్పుకోవాలని భావించారు. ఈమేరకు ఆనం ఈనెల 13వ తేదిన విశాఖపట్నంలో నిర్వహించే వైసీపీ బహిరంగ సభలో వేదికపై జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారని సమాచారం. మరోవైపు ఆనం పార్టీని వీడనుండడంతో అక్కడి ముఖ్య నేతలపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు అదిరిపోయే ప్లాన్‌ను సిద్ధం చేశారు. దీంతో గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచిన ఓ బలమైన నేతతో సంప్రదింపులు జరిపి, ఆయనను టీడీపీలోకి ఆహ్వానించారు. ఆయనే బొల్లినేని కృష్ణయ్య.2014 ఎన్నికల్లో బొల్లినేని కృష్ణయ్యను పార్టీలోకి ఆకర్షించడానికి చంద్రబాబు ఎంతో ప్రయత్నించారు. అయితే మేకపాటి కుటుంబంతో ఉన్న స్నేహ సంబంధాల కారణంగా బొల్లినేని టీడీపీలో చేరడానికి నిరాకరించారు. ఆ ఎన్నికల్లో మేకపాటి కుటుంబం గెలవడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. ఆనం రామనారాయణరెడ్డి పార్టీ వీడిన తరువాత ఆత్మకూరులో గెలుపు కోసం టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ క్రమంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించడం కోసం అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యతో చంద్రబాబు రెండు పర్యాయాలు మాట్లాడారు. కొమ్మి, బొల్లినేని వర్గాలు కలిసివస్తే పార్టీ బలపడుతుందనేది చంద్రబాబు ఆలోచన. అయితే ఎన్నికల్లో పోటీ చేయడం లేదా, టీడీపీకి సపోర్టు చేయడం అనే విషయాలపై బొల్లినేని కృష్ణయ్య సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన వైసీపీ ఓ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బొల్లినేని లేకుండానే చేసింది. ఈ సంఘటన ఆత్మకూరు రాజకీయాలపై కీలక ప్రభావం చూపబోతోందని, బొల్లినేని రాజకీయంగా టీడీపీకి దగ్గరయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

Related Posts