YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తన తండ్రిని ఉదేశించి కవితాత్మక లేఖ రాసిన స్టాలిన్..!!

 తన తండ్రిని ఉదేశించి కవితాత్మక లేఖ రాసిన స్టాలిన్..!!

తండ్రిని కోల్పోయిన స్టాలిన్‌.. ఆయనను ఉద్దేశించి  కవితాత్మక లేఖ రాసారు. ఈ లేఖ అన్నివర్గాల వారి హృదయాలను ద్రవింపజేస్తోంది. ‘‘ఎప్పుడూ నాకు చెప్పి బయటకివెళ్లే నాయకా... ఈసారి నాతో ఎందుకు చెప్పకుండా వెళ్లిపోయావు? తలైవా... మమ్మల్ని అందర్నీ ఇక్కడ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లావు? ‘అవిశ్రాంతంగా పాటుపడిన వ్యక్తి ఇదిగో ఇక్కడే విశ్రమించాడంటూ’ నీ స్మారక స్థలం వద్ద రాసిపెట్టాలని 33 ఏళ్ల ముందే చెప్పావు. 94 ఏళ్ల వయసులో 80 ఏళ్లు ప్రజా జీవితంలో అవిశ్రాంతంగా పరుగులు తీసి, మనం అధిరోహించిన శిఖరాన్ని ఇంకెవరు ఎక్కగలరో చూద్దామంటూ పోటీపెట్టి మాయమయ్యావా? తిరువారూరులో జరిగిన మీ జన్మదిన వేడుకల్లో నేను ‘మీ శక్తిలో సగం ఇవ్వండి’ అని అడిగా. ఆ శక్తిని, అన్నాదురై వద్ద మీరు అరువుగా తెచ్చుకున్న హృదయాన్ని నేనిప్పుడు కోరుతున్నా.. ఇస్తావా నాయకా! మీరిచ్చే ఆ దానంతో మీ కలల్ని, ఆశయాలను నెరవేర్చి చూపుతాం. కోట్లాది మంది పార్టీ శ్రేణుల హృదయాల నుంచి ఓ వేడుకోలు..! ఒక్కసారి ‘ఎన్‌ ఉయిరినుం మేలాన అన్బు ఉడన్‌పిరప్పుగళే’ (నా ప్రాణంకన్నా మిన్న అయిన నా తోబుట్టువులారా) అని చెప్పండి తలైవా! ఆ మాట మరో వందేళ్ల వరకు తమిళ జాతిపై, భాషపై మమకారం పెరిగేలా చేస్తుంది. మిమ్మల్ని నాన్న అనడం కన్నా తలైవా అనే ఎక్కువసార్లు సంబోధించా. ఇప్పుడైనా ఒకే ఒక్కసారి నాన్నా అని పిలవనా తలైవా! ...కన్నీటితో ఎంకే స్టాలిన్‌’’ అంటూ తన తండ్రిని ఉదేశించి స్టాలిన్ లేఖ రాసారు.

Related Posts