
భద్రాచలం సీతారామస్వామి ఆలయం అభివృద్ధి నమూనాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం పరిశీలించారు. ఆర్కిటెక్ట్ ఆనందసాయి భద్రాద్రి ఆలయ అభివృద్ధికి మూడు నమూనాలను సిద్ధం చేశారు. వీటిని పరిశీలించిన మంత్రి తుమ్మల.. చిన్నజీయర్ స్వామి ఆశీస్సులతో మూడు నమూనాలు చక్కగా కుదిరాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో తుది నమూనా ఖరారు చేస్తామని తెలిపారు. శ్రీరామనవమి లోపు పలు అభివృద్ధి పనులు మొదలు పెడతామని పేర్కొన్నారు. వచ్చే రెండు రోజుల్లోనే సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ తీసుకుని తుది నిర్ణయం వెల్లడిస్తామన్నారు.