YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అన్నా మోమోరియల్ లో కరుణ అంత్యక్రియలు

అన్నా మోమోరియల్ లో కరుణ అంత్యక్రియలు
డిఎంకే కురువృద్ధుడు,తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలు   మెరీనా బీచ్లోని అన్నా మెమోరియల్లో నిర్వహించనున్నారు. అన్నా మెమోరియల్లో అంత్యక్రియలు నిర్వహించడానికి మద్రాసు హైకోర్టు బుధవారం ఉదయం అనుమతి మంజూరు చేసింది.  కరుణానిధి అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనే అంశంపై చెన్నై హైకోర్టులో తీవ్ర వాదోపవాదాలు జగిగాయి. తమిళనాడులో ముఖ్యమంత్రులుగా పనిచేస్తూ మరణించిన వారికి మాత్రమే మెరీనా బీచ్ లో స్థలాన్ని కేటాయించారని, మాజీ సీఎంలు మరణిస్తే, మెరీనా బీచ్ లో అంత్యక్రియలను గతంలో జరపలేదని ప్రభుత్వం మద్రాస్ హైకోర్టులో తన తుది వాదనను వినిపించింది. అక్కడే అంత్యక్రియలు చేయాలని ధర్మాసనం భావిస్తే, అంగీకరిస్తామని పేర్కొంది.
పలు పర్యావరణ అంశాలు, తీర ప్రాంత నిబంధనలు ముడిపడివున్న ఈ విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు సిద్ధమేనని చెప్పింది. కామరాజ్ నాడార్ మరణించిన సమయంలో డీఎంకే అధికారంలో ఉందని, అప్పట్లో ఆయన అంతిమ సంస్కారాలను మెరీనా బీచ్ లో చేయలేదని తెలిపింది. అన్నాదురై, ఎంజీఆర్, జయలలితలు అధికారంలో ఉండి కన్నుమూసినందునే స్థలం కేటాయించామని వాదించింది. డీఎంకే రాజకీయ ఎజెండాతో వాదిస్తోందని సర్కార్ తరపు న్యాయవాదులు ఆరోపించారు. మెరీనా బీచ్లో స్మారకాలను ఏర్పాటు చేయడంపై గతంలో దాఖలు చేసిన పిటిషన్లను ఉపసంహరించుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. అంతకుముందు డీఎంకే న్యాయవాది మాట్లాడుతూ తమ అభిమాన నేత అంత్యక్రియలకు మెరీనా బీచ్లో స్థలం ఇవ్వకుంటే  తమిళనాడులో కోటిమంది డీఎంకే అభిమానులు, తీవ్ర మనస్తాపానికి గురవుతారని అన్నారు.  హైకోర్టు తీర్పు పట్ల డీఎంకే శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

Related Posts