రాజాజీహాల్ నుంచి కరుణానిధి అంతిమయాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. వాలాజారోడ్, చెపాక్ స్టేడియం మీదుగా అంతిమయాత్ర కొనసాగనుంది. మరోవైపు కరుణానిధిని ఉంచే శవపేటికపై ఒక మాటను చెక్కించారు. ముప్పై మూడేళ్ల క్రితం కరుణానిధి తన కుమారుడు స్టాలిన్ కు ఓ మాట చెప్పారట. ‘మనం చనిపోయినప్పుడు ప్రజలు మన సమాధిని చూసి..‘విరామం లేకుండా పనిచేసిన వ్యక్తి విశ్రాంతి తీసుకుంటున్నారు’ అనేంతగా పేరు తెచ్చుకోవాలి’ అని స్టాలిన్ కు కరుణ చెప్పారట. ఇప్పుడు అదే మాట కరుణానిధి భౌతికకాయాన్ని ఉంచే శవపేటికపై తమిళంలో చెక్కించారు.