ప్రయాణికులు లేని కారణంగా పలు ఇ కేటగిరి స్టేషన్లలో ప్యాసింజర్ రైళ్ల హాల్టులు రద్దు చేస్తున్నట్లు విజయవాడ డివిజన్ ఇన్చార్జ్ పీఆర్వో రాజశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 నుంచి భీమవరం - విజయవాడ (77206) ప్యాసింజర్ రైలుకు ఉప్పులూరు, పల్లెవాడ, దోసపాడు, మోటూరు, మండవల్లి స్టేషన్లలో హాల్టు రద్దు చేశారు. విజయవాడ - భీమవరం (77207) ప్యాసింజర్ రైలు కౌతవరం, దోసపాడు స్టేషన్లలో, మచిలీపట్నం - విజయవాడ (77270) ప్యాసింజర్ కౌతవరం స్టేషన్లో, మచిలీపట్నం - గుడివాడ (77220) ప్యాసింజర్ కౌతవరం స్టేషన్లో,
గుడివాడ - మచిలీపట్నం (77211) ప్యాసింజర్ మోటూరు స్టేషన్లో, భీమవరం - గుడివాడ (77267) ప్యాసింజర్ రైలు మోటూరు స్టేషన్లో, గుంటూరు - నర్సాపూర్ (57381) ప్యాసింజర్ మోటూరు స్టేషన్లో, మచిలీపట్నం - విజయవాడ (77262) ప్యాసింజర్ మధురానగర్ స్టేషన్లో, గుడివాడ - విజయవాడ (77268) ప్యాసింజర్ రైలు తరిగొప్పుల స్టేషన్లో హాల్టు రద్దు చేశారు. విశాఖపట్నం - నర్సాపూర్ (57265) లింక్ ప్యాసింజర్ రైలు డిసెంబర్ 6 నుంచి పెన్నాడ అగ్రహారం స్టేషన్లో హాల్టు రద్దయింది. మచిలీపట్నం - విశాఖపట్నం (57229) ప్యాసింజర్ రైలు సెప్టెంబర్ 8 నుంచి మండవల్లి స్టేషన్లో హాల్టు రద్దు చేశారు.
నర్సాపూర్ - విశాఖపట్నం (57264) ప్యాసింజర్ రైలు సెప్టెంబర్ 8 నుంచి పెన్నాడ అగ్రహారం స్టేషన్లో హాల్టు రద్దయింది. ధర్మవరం - మచిలీపట్నం (17246) ఎక్స్ప్రెస్ రైలు సెప్టెంబర్ 17 నుంచి తరిగొప్పుల స్టేషన్లో హాల్టు రద్దయినట్టు పీఆర్వో రాజశేఖర్ తెలిపారు.