- కాలిపోయిన 30 దుకాణాలు
తమిళనాడులోని మదుర మీనాక్షి ఆలయం తూర్పుగోపురం వద్ద శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం ఏర్పడింది. సమీపంలోని 30 దుకాణాలకు మంటలు వ్యాపించి భారీ ఆస్తి నష్టమైంది. విషయం తెలిసిన వెంటనే మదురై కలెక్టర్ వీరరాఘవరావు సంఘటన స్థలికి చేరుకున్నారు. 200 మందికిపైగా అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. ఈ సమయంలో భక్తులు, ఆలయసిబ్బంది లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తమై మంటలను అదుపు చేసిందని కలెక్టర్ తెలిపారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.