YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు కొట్టివేత

తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు కొట్టివేత

నాలుగు వారాల్లో విభజన పూర్తి చేయండి
కొత్తగా విభజన కమిటీ వేయాలి
లేదా జాయింట్ కమిటీని కొనసాగించాలి
ఈ ప్రక్రియ రెండు వారాల్లో ముగియాలి
ఆ తర్వాతే పంపకాల ప్రక్రియ చేపట్టాలి
తెలుగు రాష్ట్రాలకు న్యాయస్థానం ఆదేశం


హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజనపై తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఉద్యోగుల విభజనపై తెలంగాణ విద్యుత్ సంస్థల మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.  న్యాయమూర్తులు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎమ్మెస్కే జైశ్వాల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం ఈ కీలక తీర్పు వెలువరించింది.

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర స్థానికత ప్రకారం విద్యుత్ ఉద్యోగుల విభజన చేసిన తెలంగాణ విద్యుత్ సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలు, వాటిని ఆమోదిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన జీవోలను పెద్ద సంఖ్యలో విద్యుత్ ఉద్యోగులు హైకోర్టులో సవాల్ చేశారు. వీటిని పలుసార్లు విచారించిన బెంచ్.. సమస్య రెండు ప్రభుత్వాలు చర్చల ద్వారా పరిష్కారం జరిగేలా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత బెంచ్ తన తీర్పును గతంలో వాయిదా వేసింది. శుక్రవారం ఆ వ్యాజ్యాలపై తీర్పు వెలువరించింది. విద్యుత్ ఉద్యోగుల విభజన ప్రక్రియను నాలుగు మాసాల్లో పూర్తి చేయాలని తెలంగాణ/ఏపీ ప్రభుత్వాలను బెంచ్ ఆదేశించింది. ఇందుకోసం మార్గదర్శకాల తయారీకి కొత్తగా కమిటీలు వేయడంగానీ లేదా ఉన్న జాయింట్ కమిటీని కొనసాగించడంగానీ చేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ రెండు మాసాల్లో చేయాలని, ఆ తర్వాత కమిటీలు నిర్ణయాల మేరకు నాలుగు మాసాల్లో విభజన జరగాలని తేల్చి చెప్పింది.

స్థానికత ప్రకారం విభజన చెల్లదని, ఇప్పటికే రిలీవ్ చేసిన వారికి ఇతర ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాలని, వారి సీనియార్టీని కూడా ఆమోదించాలని ఆదేశించింది. రిలీవ్ చేసిన ఉద్యోగులకు ఏపీ సర్కార్ జీతభత్యాలు ఇచ్చి ఉంటే ఆ మొత్తాన్ని లెక్క కట్టి ఏపీకి చెల్లించేయాలని తెలంగాణను బెంచ్ ఆదేశించింది. విద్యుత్ ఉద్యోగుల బదిలీ, ఏపీకి కేటాయింపు చేసే అధికారం తెలంగాణకు లేదని బెంచ్ స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలను బెంచ్ తన తీర్పులో ఉదహరించింది. రాష్ట్రాల స్థానికత ఆధారంగా విభజన చేశారేగానీ.. కమలనాథన్, ప్రత్యూష్ సిన్హా కమిటీల సూచనల్ని అమలు చేయలేదని బెంచ్ తన తీర్పులో ఎత్తిచూపింది. పుట్టిన చోటు, ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని ఉద్యోగాలకు అర్హుడో కాదో చెప్పడానికి వీల్లేదని బెంచ్ పేర్కొంది. ఉద్యోగ భర్తీకి ఫలానా నివాస ప్రాంతం వారై ఉండాలని చెప్పే అధికారం పార్లమెంటు మాత్రమే ఉందని, రాష్ట్ర అసెంబ్లీకు లేదని తెలిపింది. దేశంలోని పౌరులంతా సమానమేనని స్పష్టం చేసింది. 1957లో ప్రాంతీయత ఆధారంగా ఏపీ రాష్ర్టంలో తెలంగాణకు ఉద్యోగావకాశాల్లో ప్రత్యేక ప్రయోజనాలను కల్పించేలా లోక్‌సభ చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసిందని హైకోర్టు బెంచ్ గుర్తు చేసింది.

Related Posts