వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయుకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 14న విశాఖ జిల్లాలో ప్రవేశించనుంది.తెలుగుదేశం పార్టీ ఎన్నో అలవికాని హామీలిచ్చి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని, జగన్ యాత్రలో ఆయా హామీలను నమ్మి తాము ఎలా మోసపోయామో జనం చెపుతున్నారని అన్నారు.వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా ప్రతి ప్రాంతంలో, ప్రతి జిల్లాలో స్థానికులు అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వచ్చారని తెలిపారు. ఆయా సమస్యల మీద ఆయన తగిన విధంగా స్పందిస్తున్నారని, హామీలు ఇస్తున్నారని పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో కూడా ప్రజలు తమ సమస్యలు పెద్ద ఎత్తున జగన్ దృష్టికి తెస్తారన్నారు.విశాఖ జిల్లాలోని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ పర్యటన ప్రస్తుతానికి ఖరారైందన్నారు. నర్సీపట్నంలో ప్రారంభించి విశాఖ శివార్ల వరకూ ఆయన పర్యటన సాగుతుందని అమర్నాథ్ తెలిపారు. కాగా గత ఏడాది నవంబర్ 7న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి వైఎస్ జగన్ ప్రజాసంలక్పయాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోన్న విషయం తెలిసిందే.