విజయవాడలోని షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్స్ కు వినియోగదారుల ఫోరమ్ మొట్టికాయలు వేసింది. మల్టిప్లెక్స్ లలో అధిక ధరలకు తినుబంఢారాల విక్రయంపై జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు ఇచ్చింది. మల్టిప్లెక్స్ ధియేటర్లు లలో అధిక ధరలకు విక్రయాపై ఫోరంను పలువురు వినియోగదారులు ఆశ్రయించారు. మార్గదర్శక సమితి సహకారంతో గత ఏడాది ఏప్రిల్ లో ఫోరంలో పిటిషన్ దాఖలు అయింది. వాదనలు విన్న తర్వాత జిల్లా వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి మాధవరావు తీర్పు వెల్లడించారు. సామాన్య ప్రజలకు అర్ధమయ్యే రీతిలో న్యాయమూర్తి తెలుగులో తీర్పు వెలువరించారు. ఎల్ఈపీఎల్, , ట్రెండ్ సెట్, పీవీఆర్, పీవీపీ, ఐనాక్స్ మల్టీ ప్లెక్స్ థియేటర్ల లో తినుబండారాలు, శీతల పానియాలను అధిక ధరలకు విక్రయించియినందుకు భారీగా జరిమానా విధించారు. వినియోగదారులకు నష్టం కల్గించినందుకు ఒక్కొక్క సంస్థ 5లక్షల చొప్పున 25 లక్షలు రాష్ట్ర వినియోదరుల సంస్థకు చెల్లించాలి. అంతేకాదు, బయట నుంచి తెచ్చిన తినుబండారాలు, తాగునీటిని మల్టీప్లెక్స్ లలో అనుమతించాలని తీర్పు ఇచ్చారు. ఈ ఆదేశాలు తప్పక అమలు చేయాలని న్యాయమూర్తి అధికారులను ఆదేశించారు. ఆదేశాల అమలు, బాధ్యతను తూనికల కొలతల శాఖకు అప్పగించారు.