విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపధ్యంలో మరోసారి బాక్సైట్ అంశంపై రాజకీయ పక్షాలు నిరసనకు దిగాయి. జీవిఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసనలో రాజకీయ నేతలు పాల్గోని బాక్సైట్ కు వ్యతిరేకంగా గళమెత్తారు. ఆదివాసీ దినోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి పర్యటనలో గిరిజనులకు స్పష్టమైన హామీ,సాధించుకున్న చట్టాలను సక్రమంగా అమలు చేసే విధంగా చంద్రబాబు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిపాలన నాలుగేళ్ల పూర్తైయిన తర్వాత చంద్రబాబుకు గిరిజనులు గుర్తుకు వచ్చారని జనసేన నేతలు వ్యాఖ్యా నిచ్చారు. గతంలో గిరిజనుల అనుమతి లేకుండా బాక్సైట్ తవ్వకాలు చేపట్టబోమని చెప్పిన చంద్రబాబు నేటికీ స్పష్టత ఇవ్వకుండా గిరిజనులను మోసగిస్తున్నారని అన్నారు. గిరిజనులు సాధించి గెలుచుకున్న చట్టాలను అమలుపై గిరిజనులకు సమాధానం చెప్పిన తర్వాతే పర్యటనలు చెయ్యాలని డిమాండ్ చేశారు.