అఖిల్.. నిధి అగర్వాల్ జంటగా "తొలి ప్రేమ" ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ లండన్ లో జరుగుతుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అదే టైటిల్ ను ఖరారు చేశారనీ .. రిజిస్టర్ కూడా చేయించారనేది తాజా సమాచారం. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించే ఈ చిత్రం డిసెంబర్ లో విడుదల అవుతుందని సమాచారం.