పూరీ దగ్గరికి వెళితే రవితేజ కలిశాడు
శ్రీను వైట్లకు పరిచయం చేశాడు
ఆయనకి అప్పుడు ఒక కథ చెప్పాను
ఆ సినిమాయే 'వెంకీ'
కథ .. స్క్రీన్ ప్లే .. మాటలను అందించడంలో కోన వెంకట్ కి ప్రత్యేకమైన ముద్ర వుంది. ఆయన పని చేసిన చాలా సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అందువలన కథానాయకులలో చాలామంది తమ సినిమాలకు ఆయన పని చేయాలని కోరుకుంటారు. అలాంటి కోన వెంకట్ తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, టాలీవుడ్ లో తన కెరియర్ మొదలైన విషయాలను గురించి ప్రస్తావించారు.
'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' జరుగుతోన్న సమయంలో నేను పూరీ జగన్నాథ్ ను కలిశాను. అక్కడే రవితేజ పరిచయమయ్యాడు. రవితేజను పూర్తి స్థాయి హీరోగా పెట్టి 'నీ కోసం' సినిమా చేసింది శ్రీను వైట్లనే. ఇద్దరి మధ్యా మంచి ఫ్రెండ్షిప్ వుంది .. దాంతో నన్ను శ్రీను వైట్లకు పరిచయం చేశాడు. శ్రీను వైట్ల నాకు రైటర్ గోపీమోహన్ ను పరిచయం చేశాడు. అప్పుడు నా దగ్గరున్న ఒక కథను గురించి చెప్పాను. అంతా కలిసి సరదాగా సాగర్ వెళ్లి కథను డెవలప్ చేశాము .. ఆ సినిమాయే 'వెంకీ' అని చెప్పుకొచ్చారు.