"యుగానికి ఒక్కడు", "తడాఖా" చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి ఆండ్రియా. ఈమె తాజాగా కమల్ సరసన 'విశ్వరూపం 2' చిత్రం లో నటించింది. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు ఎంతో ధైర్యం అవసరమని ఆండ్రియా తెలిపింది. నటి శ్రీరెడ్డి వివాదాల గురించి తనను ప్రశ్నిస్తూ ఉంటారని... ఆమె చెబుతున్న వాటిలో నిజం ఉంటే, వాటిని బహిరంగపరచడానికి ఆమెకు ఎంతో ధైర్యం కావాలని చెప్పింది. ఎవరికైనా అలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు, వాటిని కచ్చితంగా బయటపెట్టాలని సూచించింది. తనకైతే ఇటువంటి అనుభూతులు ఎదురుకాలేదని చెప్పింది.