కరుణానిధి మరణంతో డీఎంకే అధ్యక్షుడి స్థానంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ను నియమించేందుకు పార్టీ సిద్దమవుతుంది. చాలా సందర్భాలలో తన రాజకీయ వారసుడు స్టాలిన్ అని కరుణానిధి చెప్పారు. గత ఎన్నికల సమయంలో స్టాలిన్ రాష్ట్రమంతా తిరిగి... ప్రధాన ప్రతిపక్ష పార్టీకి గతంలో ఎన్నడూ లేని విధంగా 89 స్థానాలను సాధించిపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14 న స్టాలిన్ పార్టీ అధక్ష్య బాధ్యతలు చేపట్టబోతున్నారు.