ఆంధ్ర బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,019 కోట్ల మూలధన నిధులు సమకూర్చనుంది. దీనికి బదులుగా ఆంధ్ర బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికి ఈక్విటీ షేర్లు జారీ చేసింది. రూ. 2,019 కోట్ల విలువకు 'ప్రిఫెరెన్సిల్ అలాట్మెంట్ ' పద్ధతిలో కేంద్ర ప్రభుత్వానికి షేర్లు కేటాయించాలని శుక్రవారం ఆంధ్రాబ్యాంకు డైరెక్టర్ల బోర్డు సమావేశంలో నిర్ణయించారు. ఇదేకాకుండా రూ.10 కోట్లకు ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగుల షేర్లు కొనుగోలు పథకం కింద షేర్లు కేటాయించాలని ప్రతిపాదించారు.
మరో వైపు ఆంధ్రాబ్యాంకు ఇంకా నష్ఠాల బాటలోనే కొనసాగుతుంది. ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.539.83 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. క్రితం, ఆర్ధిక సంవత్సరం ఇదేకాలంలో రూ. 40.42 కోట్ల నికర లాభం ఉండటం గమన్హారం.