YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఘనంగా ప్రారంభమైన మహాసంప్రోక్షణ ఆరు రోజులు ఏం చేస్తారు..

ఘనంగా ప్రారంభమైన మహాసంప్రోక్షణ ఆరు రోజులు ఏం చేస్తారు..
కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి  అసలు ఆరు రోజుల పాటు స్వామిని కానలేక.. ఎలా ఉండగలిగేదన్న ఆందోళన చెలరేగింది. అయితే, ఈ ఆరు రోజుల పాటు ఆలయంలో నిర్వహిస్తున్న అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం లోక కల్యాణం కోసమేనని, ఇది చేయడం వల్ల దేశం కూడా సుభిక్షంగా ఉంటుందని ఇతిహాసాలు చెబుతున్నాయి. ఈ సంప్రోక్షణం ప్రముఖ వైష్ణవ ఆలయాల్లో జరుగుతూనే ఉంటుంది.శ్రీవారి ఆలయంలో శనివారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువు వైభవంగా ప్రారంభమైంది. వైఖానస ఆగమాన్ని పాటించే అన్ని వైష్ణవాలయాల్లో లోక సంక్షేమం కోసం ప్రతి 12 ఏళ్లకోసారి ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయంలోని యాగశాలలో 28 హోమగుండాలు ఏర్పాటుచేశారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో 44 మంది రుత్వికులు, వంద మంది వేద పండితులు, ధర్మగిరి వేద పాఠశాల నుంచి 20 మంది వేద విద్యార్థులు పాల్గొంటారు. వేద పండితులు చతుర్వేద పారాయణం, పురాణాలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత పారాయణం చేస్తారు. 1958, ఆగస్టు నెలలో విళంబినామ సంవత్సరంలో శ్రీవారి ఆలయ విమాన సంప్రోక్షణ, స్వర్ణకవచ తాపడం జరిగింది. సరిగ్గా 60 ఏళ్ల తర్వాత అదే విళంబినామ సంవత్సరంలో మహాసంప్రోక్షణ జరుగుతోంది.మహాసంప్రోక్షణ సందర్భంగా ఆగస్టు 11 నుంచి 16 వరకు రూ.300.. సర్వదర్శనం.. దివ్యదర్శనం టోకెన్ల పంపిణీని నిలిపివేయనున్నారు. వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, ఆర్జిత సేవలు, ఇతర ప్రత్యేక దర్శనాలు  రద్దయ్యాయి.మహాసంప్రోక్షణకు ఎనిమిది టన్నుల పూలను ఉపయోగించనున్నారు. సంప్రోక్షణ ప్రారంభం నుంచి ముగింపు వరకు సర్వాంగసుందరంగా పుష్పాలంకరణ చేయనున్నారు. చెన్నై, కోయంబత్తూరు, కర్నూలు, సేలంకు చెందిన పలువురు భక్తులు కట్‌ ఫ్లవర్స్‌ను దేవునికి విరాళంగా సమర్పించనున్నారు.మహాసంప్రోక్షణ పురస్కరించుకుని స్వామి వారికి పూజా కైంకర్యాలు, వైదిక కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉన్నందున దర్శన సమయాన్ని టీటీడీ కుదించింది. అలాగే, మహాసంప్రోక్షణపై విస్తృత ప్రచారం చేయడంతో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గుముఖం పట్టింది. టైంస్లాట్, కాలినడక కౌంటర్ల క్యూ నిర్మానుష్యంగా మారింది. ఐదు కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ బోసిపోయింది.ఉదయం భగవంతుని అనుమతితో ఆచార్యులకు స్థాన నిర్ణయం నిర్వహించారు. దీన్నే ఆచార్యవరణం లేదా రుత్విక్‌ వరణం అంటారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సేనాధిపతి ఉత్సవాన్ని నిర్వహించారు.వసంత మండపం వద్ద పుట్టమన్ను సేకరించి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు యాగశాలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం చేపట్టారు. ఇక రెండో రోజు హోమ గుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వాస్తు హోమం, రక్షాబంధనంతో కార్యక్రమాలు మొదలవుతాయి.రెండో రోజు  కళాకర్షణలో భాగంగా గర్భాలయంతోపాటు అన్ని ఉప ఆలయాల్లోని దేవతామూర్తుల శక్తిని కలశంలోకి ఆవాహన చేస్తారు. ఈ కుంభాలతోపాటు అందరు దేవతల ఉత్సవమూర్తులను యాగశాలలోకి వేంచేపు చేస్తారు. మొత్తం 18 వేదికలపై కుంభాలను కొలువుదీరుస్తారు. యాగశాలలో రోజూ నిత్య కైంకర్యాలతో పాటు ఉ. 6 గంటల నుంచి హోమాలు నిర్వహిస్తారు. మూడో రోజు విశేష హోమాలతోపాటు అష్టబంధన ద్రవ్యం తయారుచేస్తారు. రెండు రోజుల పాటు  గర్భాలయంతోపాటు ఉప ఆలయాల్లో అష్టబంధనాన్ని సమర్పిస్తారు. అష్టబంధనం గురించి భగుప్రకీర్ణాధికారం, విమానార్చన ప్రకల్పం గ్రంథాల్లో వివరించి ఉంది. 8 రకాల ద్రవ్యాలతో అష్టబంధనాన్ని తయారుచేస్తారు. పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, చుట్టుపక్కలా అష్టబంధనాన్ని సమర్పిస్తారు. ఐదో రోజు  కైంకర్యాల అనంతరం మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట తరువాత గర్భాలయంలోని మూలవర్లకు 14 కలశాలతో మహాశాంతి తిరుమంజనం చేపడతారు. ఉత్సవమూర్తులకు యాగశాలలోనే అభిషేకం నిర్వహిస్తారు.. తర్వాత ఆలయంలో ఉ.10.16 నుండి 12 గంటలలోపు కళావాహన చేస్తారు. శ్రీవారి మూలమూర్తికి, విమాన గోపురానికి, ఉప ఆలయాల్లోని స్వామివారి విగ్రహాలకు, గోపురాలకు తిరిగి కుంభంలోని శక్తిని ఆవాహన చేస్తారు.ఆ తరువాత ఆరాధన, నైవేద్యం, అక్షతారోపణం, బ్రహ్మఘోష, అర్చక బహుమానం సమర్పిస్తారు. ఈ కార్యక్రమంతో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం ముగుస్తుంది. సాయంత్రం శ్రీ మలయప్ప స్వామివారు పెద్దశేష వాహనంపై మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. గరుడ పంచమి సందర్భంగా అదేరోజు రాత్రి గరుడ వాహన సేవ జరుగుతుందితిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి  అసలు ఆరు రోజుల పాటు స్వామిని కానలేక.. ఎలా ఉండగలిగేదన్న ఆందోళన చెలరేగింది. అయితే, ఈ ఆరు రోజుల పాటు ఆలయంలో నిర్వహిస్తున్న అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం లోక కల్యాణం కోసమేనని, ఇది చేయడం వల్ల దేశం కూడా సుభిక్షంగా ఉంటుందని ఇతిహాసాలు చెబుతున్నాయి. ఈ సంప్రోక్షణం ప్రముఖ వైష్ణవ ఆలయాల్లో జరుగుతూనే ఉంటుంది.ప్రతిరోజూ సుమారు లక్ష మంది వరకు భక్తులు వచ్చే ఆలయం కావడంతో తిరుమలలో కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి వస్తోంది. సాధారణంగా తిరుమలేశుని మూలవిరాట్టులోని స్వామివారి అంశ 12 సంవత్సరాల పాటు కొలువుంటుంది. కాలపరిమితి తీరే లోపు శ్రీవారి అంశను ఒక కలశంలోకి ఆవాహన చేయాల్సి ఉంటుంది. స్వామివారి పాదాల వద్ద ఉండే పద్మ పీఠాన్ని ఎనిమిది రకాల ద్రవ్యాలతో బంధనం చేసి, తిరిగి విరాట్  రూపంలో స్వామి వారిని  స్థిరపరచాలని వైఖానస ఆగమం చెబుతోంది. దీనికి గాను అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణం నిర్వహిస్తారని వైఖానస వంశీకులు చెబుతు న్నారు.ఈ క్రతువును నాలుగు రోజుల పాటు వరకు నిర్వహించనున్నారు.  ఆలయ ప్రధాన అర్చ కులు, ఆగమ సలహాదారులైన వేణుగోపాల దీక్షితులు కంకణ భట్టార్‌గా వ్యవహరించనున్నారు. 40 మందికి పైగా రుత్వికులు, వందమందికి పైగా వేద పండితులు, ప్రబంధ పండితులు, వేద విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆగస్టు 12వ తేదీ నుంచి మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 15వ తేదీన మహాశాంతి  తిరుమంజనం, 16న ఉదయం 10.16 గంటలకు తులాలగ్నంలో మహాసంప్రోక్షణం చేస్తారు.క్రతువు పూర్తయిన తరువాత కూడా ఆగస్టు 17వ తేదీ నుంచి అక్టోబరు మూడో తేదీ వరకు అంటే 48 రోజులు పాటు మండలాభిషేకం కూడా నిర్వహిస్తారు. అయితే దీనికి ఎక్కువ నిబంధనలు ఉండకపోవడంతో భక్తులు స్వామి వారి దర్శనం యథావిధిగా చేసుకునే వీలు ఉంటుంది.అష్టబంధనం అంటే ఎనిమిది రకాల వస్తువులతో తయారు చేసిన చూర్ణం. దీని ఆయుర్దాయం 12 సంవత్సరాలు ఉంటుందని అర్చకులు చెబుతున్నారు. ఈ అష్టబంధనాన్ని శ్రీవారి పాదాలకు, పీఠానికి మధ్య భాగంలో ఉంచుతారు. శ్రీవారి మూలమూర్తి, ఇతర దేవతామూర్తుల శక్తిని బింబం నుంచి కుంభంలోకి ఆవాహన చేసి, ఉపచారాలు, శాంతిహోమాలు నిర్వహిస్తారు.ఈ సమయంలో గర్భాలయంలో మరమ్మతులు కూడా అర్చకులే నిర్వహిస్తారు. మూలమూర్తికి జరిగే సేవలను యాగశాలలోని స్వామివారికి కూడా నిర్వహిస్తారు.1958 నుంచి మహాసంప్రోక్షణంపై పత్రాలుపురాతన కాలం నుంచి మహాసంప్రోక్షణం తిరుమలో జరుగుతున్నా, 1958 నుంచి జరుగుతున్నట్లు పత్రాలు తిరుమల తిరుపతి దేవస్థానాలలో ఉన్నాయి. తరువాత 1970, 1982, 1994, 2006లలో మహా సంప్రోక్షణం క్రతువులు జరిగాయి. అప్పటినుంచి కూడా క్రమం తప్పకుండా జరుగుతున్నా, గర్భాలయం సమీపానికి భక్తులను పంపకుండా దర్శనం కల్పించేవారు. జయ విజయల ద్వారం వరకే అనుమతి ఇచ్చేవారు. అప్పట్లో తక్కువ మంది భక్తులు వచ్చేవారు కాబట్టి.. దర్శనం కల్పించేందుకు వీలుండేది.ఇపుడు ఆలయంలో సంప్రోక్షణ కోసం యాగశాలలు,  తాత్కాలిక నిర్మాణాలు జరుగనున్నాయి. అవి భక్తుల రాకపోకలకు ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వైదిక క్రతువుకూ అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఈ కారణంగానే భక్తులను ఆలయంలోకి నియంత్రించాల్సిన అవసరం ఏర్పడుతోంది.దీంతో పూర్తిగా దర్శనం రద్దుచేసి, స్వామి వారి కైంకర్యాలతో పాటు క్రతువును నిర్విరామంగా చేపట్టాలని  భావించింది. అయితే ప్రభుత్వం తో పాటు భక్తల నుంచి వచ్చిన అభ్యర్థనతో... మూడు రోజుల పాటు దశల వారీగా భక్తులకు దర్శన భాగ్యం కల్గించాలని నిర్ణయించారు. 

Related Posts