స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారుల కోసం 'ఫ్రీడమ్ ఆఫర్ - చోటా ప్యాక్' పేరిట వాయిస్, డేటా లాభాలను అందించే రెండు సరికొత్త ఆఫర్ లని ప్రకటించింది. 'ఫ్రీడమ్ ఆఫర్ - చోటా ప్యాక్'లో రూ.29, రూ.9లాంటి రెండు పథకాలు ఉన్నాయి. 7రోజుల వ్యాలిడిటీ గల రూ.29 ప్లాన్ లో రోజుకు 2జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అలాగే, ఒకరోజు వ్యాలిడిటీ గల రూ.9 ప్లాన్ లో 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ తో పాటు100ఎస్‌ఎంఎస్‌లని వినియోగదారులు ఉచితంగా పొందుతారు.