అదే తడబాటు.. బ్యాట్స్‌మెన్ చెత్త ఆటతో ఐదు టెస్టుల సిరీ్‌సలో భారత్‌కు మరో ఓటమి. ఆండర్సన్ (4/23), బ్రాడ్ (4/44) నిప్పులు చెరగడంతో కోహ్లీ సేన రోజంతా కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. ఫలితంగా ఇన్నింగ్స్ 159 పరుగులతో దారుణంగా చిత్తయింది. 289 పరుగుల భారీ లోటుతో నాలుగోరోజు, ఆదివారం రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన భారత్.. అండర్సన్, బ్రాడ్ ధాటికి కేవలం 47 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ కోహ్లి (17) సహా ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా పోరాడలేదు. అశ్విన్ (33 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఉదయం 357/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ 396/7 వద్ద డిక్లేర్ చేసింది. సెంచరీ హీరో క్రిస్ వోక్స్ 137 పరుగులతో అజేయంగా నిలిచాడు. కరన్ (40)తో ఏడో వికెట్‌కు అతడు 76 పరుగులు జోడించాడు. కరన్ ఔట్ కాగానే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. వోక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. మూడో టెస్టు ఈ నెల 18న నాటింగ్‌హామ్‌లో ఆరంభమవుతుంది.