యువరాజ్ సింగ్ తాజాగా యుడబ్బ్యూసీ బ్రాండ్ పేరుతో మొహాలీ, చండీఘర్‌లలో ఫ్యాషన్ లేబుల్స్ లాంచ్ చేశాడు. ఇవి అతనికి సెకండ్ స్టోర్స్. ఫ్యాషన్ రంగంలో రోజురోజుకూ వస్తున్న మార్పులకు అనుగుణంగా ట్రెండ్‌ను ఫాలో అవుతూ రూపొందించే వెరైటీ డిజైన్లు ఈ స్టోర్స్‌లో లభిస్తాయి. ఫ్యాషన్ అభిరుచి గల వ్యక్తిగా ఇలాంటివి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తానంటున్నాడు యువీ. తాజా స్టోర్స్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. క్రికెట్ తర్వాత నాకు అంతటి ప్రతిష్టాత్మకమైంది ఫ్యాషన్ లేబుల్స్. కాలేజీ రోజుల నుంచి నేను రకరకాల బ్రాండ్స్ వాడేవాడిని. తర్వాత క్రికెటర్‌గా ఎదిగిన తర్వాత రకరకాల బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా పనిచేశాను. ఇంకా చేస్తూనే ఉన్నాను. అయితే ప్రత్యేకంగా నాకంటూ ఒక బ్రాండ్ ఉండటం.. వాటిని ప్రజలు ఆదరిస్తుండటం గ్రేట్‌గా అనిపిస్తుంది. మనిషి ఏదో ఒకదానికే కాకుండా ఇలా రకరకాల వాటిల్లో ప్రవేశాన్ని కలిగి ఉంటే పరిణతి పొందవచ్చనుకుంటున్నాను అని స్టోర్ లాంచింగ్ సందర్భంగా యువ ఫీలింగ్స్ వెల్లడించాడు. సరసమైన ధరలకే లభిస్తున్న తమ బ్రాండ్స్ కావాలనుకునే వాళ్లు వైడబ్ల్యూసీఫ్యాషన్ డాట్ కామ్ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించాడు యువీ.