బడ్జెట్‌తోనే అన్ని సమస్యలు పరిష్కారం కావని బడ్జెట్‌తోనే అన్ని సమస్యలు పరిష్కారం కావని అన్నారు. అలాగే గురువు స్థానాన్ని గూగుల్ ఎప్పటికీ భర్తీ చేయలేదని చెప్పారు.పెదనండిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ..దేశంలో ఇంకా 30శాతం మంది నిరక్షరాస్యులు ఉన్నారని, వంద శాతం అక్షరాస్యత ఉండేలా చేయడం మనముందున్న పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. అన్నిటికంటే విద్యనే ప్రధానమైందని.. విద్య ద్వారా ఎన్నో సవాళ్లను ఎదుర్కొనవచ్చని అన్నారు..ఇక అన్నిరకాల ప్రజానీకాన్ని గౌరవించడమే దేశభక్తి అని.. మనకోసమే కాకుండా అందరి కోసం బతకాలని అన్నారు. ఎంత ఎదిగినా సొంత ఊరు, కన్నతల్లి, మాతృభాష, గురువులను ఎప్పటికీ మరిచిపోకూడదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, ఆనంద్ బాబు, ప్రత్తిపాటి, గల్లా జయదేవ్, రావెల, ధూళిపాళ్ల తదితరులు పాల్గొన్నారు.