చలన చిత్ర పరిశ్రమలో లీకులు కామనేనని మరోమారు అర్థం అయింది. మొన్న విజయ్ దేవరకొండ నటించిన "గీత గోవిందం" సినిమా లీకు అయినా సంగతి తెలిసిందే. ఇప్పుడు కోలీవుడ్నూ ఇది వేధిస్తోంది. తాజాగా, తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘సర్కార్’ సినిమా పాటకు సంబంధించి 21 సెకన్ల నిడివి ఉన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అమెరికాలోని లాస్వేగాస్లో చిత్రీకరించిన ఈ పాటకు డ్యాన్స్ మాస్టర్ శోభి కొరియాగ్రఫీ అందించారు. ఇందులో విదేశీ డ్యాన్సర్లు కూడా చిందేశారు. దీంతో ఈ వీడియో లీక్పై వారి హస్తం ఉందేమోనని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను వెనక నుంచి తీసినట్టు తెలుస్తోంది.