- జమిలి ఎన్నికలే గోల్..
- మోదీపై వ్యూహం మార్చిన చంద్రబాబు
టీడీపీ-బీజేపీ మిత్రపక్షాలు.. నమ్మకమైన మిత్రులు… ఇది నిన్నమొన్నటిదాకా వినిపించిన మాట. చంద్రబాబును మించిన నమ్మకమైన నేత దేశ రాజకీయాలలోనే లేరు. ఆయన మాకు విశ్వసనీయ మిత్రుడు.. ఈ మాటలన్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ దేశ ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. అలాంటి నేతలు తాజాగా తమ మిత్రుడు అధికారంలో ఉన్న ఏపీకి మాత్రం ఎలాంటి సాయం చేయకుండా చిప్ప చేతికి అందిస్తున్నారు. తమ వ్యూహాలు తాము రచించుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి, వారు చేస్తున్న రాజకీయాన్ని ఎలా ఎదుర్కోవాలి..? వారికి ఎలా చెక్ చెప్పాలి..? ఇవే ఇప్పుడు టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు. దీనికోసమే టీడీపీ అధినేత చంద్రబాబు పక్కా వ్యూహం రచించారట. కొన్ని రోజుల క్రితం.. కేంద్రమంత్రి సుజనా చౌదరితో మోదీ, అమిత్‌షా చంద్రబాబుకు ఓ రాయబారం పంపారు. జమిలి ఎన్నికల కోసం కలిసి రావాలని. దానికి చంద్రబాబు కూడా ఓకే చెప్పారట. కానీ, కొన్ని కండిషన్‌లు పెట్టారని సమాచారం. వాటి ప్రకారం…. ఏపీకి ఆర్ధిక సాయం చేయడం అందులో ప్రధానమైనది. అయితే, తాజా బడ్జెట్‌తో ఆ అంచనాలు పటా పంచలయ్యాయి. అందుకే, చంద్రబాబు కూడా స్ట్రాటజీ మార్చాడట. బీజేపీకి ఇచ్చిన హామీకి కట్టుబడతామని చెప్పి, లాస్ట్ మినిట్‌లో తమ పరిస్థితులకు అనుగుణంగా ఓ డెసిషన్ తీసుకోవాలని భావిస్తున్నాడట. బీజేపీ నేతలు జమిలి ఎన్నికల కోసం పట్టుబడితే… తీవ్ర ఆర్ధిక కష్టనష్టాలతో ఉన్న ఏపీకి భారీ ప్యాకేజ్ ప్రకటించాలని, అందులోనూ దానికి చట్టబద్ధత కల్పించిన తర్వాతే వారితో కలిసి నడవాలని నిర్ణయించుకున్నాడట. లేకుంటే మీదారి మీరు చూసుకోండని వారికి గట్టిగా చెప్పాలని ఓ డెసిషన్ తీసుకున్నట్లు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.
జమిలి ఎన్నికలు జరిగితే ..అది బీజేపీకి లాభం. కాంగ్రెస్ నెమ్మదిగా పాజిటివ్ దక్కించుకుంటోంది. ఇటు, బీజేపీ గ్రాఫ్ పడిపోతోంది. అందుకే, కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలలో ఒక్కో రాష్ట్రంలో విడివిడిగా ఎన్నికలు జరిగితే… ఒక్కోచోట నెగిటివ్ మార్కులు పడితే… రాబోయే ఎన్నికలలో లోక్‌సభలోనూ పరాభవం తప్పదు. ఇదే బీజేపీ ప్లాన్. అందుకే, తాము మునుగుతున్నప్పుడు ఇతరులను కలిసి రమ్మంటే ఎలా…? ఇటు అధికారంలో ఉన్న టీడీపీ ఏపీలో పడుతున్న రాజకీయ ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోకుండా చేస్తున్నప్పుడు తాము మాత్రం ఎందుకు కలిసి రావాలనేది వారి ఆలోచన. అందుకే, మోదీకి సరైన టైమ్‌లో సరైన ఝలక్ ఇవ్వడానికి చంద్రబాబు రెడీ అవుతున్నారట. ఆయన యాక్షన్ ప్లాన్ త్వరలోనే బయటకు రానుందనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఏం జరుగుతుందనేది చూడాలి.