తిరుమల తిరుపతి.. ఆధ్యాత్మికంగానే కాదు, ప్రకృతి అందాలతోనూ పర్యాటకుల మనసు దోచుకుంటుంది. అయితే, తిరుమల కొండలాగానే తిరుపతి సమీపంలోనూ పలు హిల్ స్టేషన్లు సైతం ఆకట్టుకుంటున్నాయి. స్వామివారి దర్శనానికి ముందు లేదా తర్వాత మీకు సమయం ఉంటే.. తప్పకుండా ఈ హిల్ స్టేషన్లు సందర్శించండి. లేదా వేసవిలో విడిదికి సిద్దమవ్వండి. తెలుగు రాష్ట్రాల్లోనే ఎత్తైన జలపాతం ఇక్కడ ఉంది. తిరుపతికి 48 కిమీల దూరంలో శేషాచలం కొండల్లో ఉన్న తలకోన ప్రకృతి అందాలతో కట్టిపడేస్తుంది. 60 మీటర్ల ఎత్తు నుంచి జాలువారే ఈ జలపాతంలో నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే.. అందులో ఉండే చేపలు, భక్తులు వేసే నాణేలు సైతం స్పష్టంగా కనిపిస్తాయి. తలకోన ఇక్కడికి చేరుకునేందుకు తిరుపతి బస్ కాంప్లెక్స్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. తిరుపతి నుంచి యెర్రావారిపాళెం చేరుకుని అక్కడి నుంచి ఆటో లేదా వ్యానుల్లో తలకోనకు చేరుకోవచ్చు. తిరుపతికి 55 కిమీల దూరంలో ఈ హిల్ స్టేషన్ ఉంది. చిత్తూరు జిల్లాలోని కుసస్థలి నది ఒడ్డున, సముద్ర మట్టానికి 855 కిమీల ఎత్తులో కొండ ఉంది. ఈ ప్రాంతాన్ని నగరి ముర్కొండ అని కూడా పిలుస్తారు. అక్కడి అటవీ ప్రాంతం, జలపాతాలు పర్యటకులను ఆకట్టుకుంటాయి. ట్రెక్కింగ్ చేసేవారికి ఈ ప్రాంతం అనుకూలమైనది. ఈ ప్రాంతం మనిషి ముక్కును పోలి ఉంటుంది. ఇక్కడ నుంచి పకృతి అందాలను ఆశ్వాదించవచ్చు. నగరి సమీపంలోని కైలాశకోన జలపాతం కూడా చూడదగినది. తిరుపతి 140 కిమీలు, చిత్తూరుకు 29 కిమీల దూరంలో సముద్ర మట్టానికి 1314 మీటర్ల ఎత్తులో ఈ ప్రాంతం ఉంది. వేసవిలో సైతం ఈ ప్రాంతం చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యటకులను కనువిందు చేస్తాయి. హార్సిలీ హిల్స్‌కు వెళ్లే కొండదారి ఎంతో అందంగా ఉంటుంది. రెండు వైపులా నీలగిరి (యూకలిప్టస్) చెట్లతో ఆ ప్రాంతం సువాసనలు వెదజల్లుతుంది. ఈ ప్రాంతం ట్రెక్కింగ్‌కు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడికి హైదరాబాద్, తిరుపతి నగరాల నుంచి బస్సుల్లో ఇక్కడికి చేరుకోవచ్చు.