వంట గ్యాస్ ధర మళ్ళి పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆధారంగా దేశ వ్యాప్తంగా ప్రతి నెలా 1వ తేదీన చమురు సంస్థలు ధరల్లో మార్పులు చేపడుతుంటాయి. అదనపు సిలిండర్ మీద రూ.36 పెరిగింది. అయితే పెరిగిన ధరకు తగ్గట్టుగా సబ్సిడీని కూడా పెంచినట్లు పేర్కొన్నారు. హైద్రాబాద్ లో ఈ నెలారంభంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.811 ఉండేది, ఇపుడు పెరిగిన ధరతో కలిపి రూ.867 అయింది. జూన్ లో సిలిండర్ ధర రూ.753 ఉండడం గమన్హారం.