- మెగా ఫ్యామిలీ దక్కించుకుంటోంది.
అక్కినేని కుటుంబం మిస్సయిన ఛాన్స్.. మెగా ఫ్యామిలీ దక్కించుకుంటోంది. ఇదేదో సినిమా ఛాన్స్ అనుకునేరు.. రియల్ స్టోరీయే! అక్కినేని ఫ్యామిలీతో వియ్యమందుకోవాల్సిన ఒక ఖరీదైన కుటుంబం.. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మెగా ఫ్యామిలీ వైపు చూస్తోందట!
ముహూర్తం దాకా వచ్చి ఆగిపోయిన అఖిల్ పెళ్లి విషయమే ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకొచ్చేసింది. ప్రముఖ వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి కుటుంబానికి చెందిన శ్రియా భూపాల్ కీ, అక్కినేని అఖిల్ కీ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే! అయితే.. వారి పెళ్లి చివరి నిమిషంలో రద్దయిపోయింది. దీనికి కారణాలేంటన్నది రెండు ఫ్యామిలీలూ వెల్లడించలేదు. సరే.. ఆ విషయం అప్పటికి సర్దుమణిగింది. ఈలోగా.. అఖిల్ సోదరుడు నాగచైతన్య పెళ్లి సందట్లో పడింది అక్కినేని కుటుంబం..!
కట్ చేస్తే.. జీవీకే గారి అమ్మాయి శ్రియా భూపాల్ మళ్ళీ పెళ్లి చూపుల్లో మునిగిపోయిందని..ముహూర్తం కూడా ఖరారైందని వార్తలొస్తున్నాయి. హీరో రాంచరణ్ భార్య ఉపాసన కామినేని కజిన్‌తో శ్రీయా భూపాల్ పెళ్లి నిశ్చయమైందట!
ఏదైతేనేం.. అక్కినేని ఫ్యామిలీని మిస్సయినా..