ఇంగ్లాండ్ తో వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు అందుకుంటుంది టీం ఇండియా. మరో వైపు భువనేశ్వర్ కుమార్, బుమ్రా లేకపోవడం ఇప్పటి వరకు భారత్కు పెద్ద దెబ్బే. ఇప్పుడు బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించాడన్న వార్త భారత అభిమానులలో అందని నింపుతుంది. భారత బౌలర్ బుమ్రా మూడో టెస్టుకు సిద్ధమయ్యాడు. గాయం నుంచి బుమ్రా పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే బుమ్రా రాకతో టీమిండియా బౌలింగ్ మరింత బలంగా మారనుంది. కానీ, బ్యాట్స్మెన్ల వైఫల్యాన్ని ఎలా అధిగమించాలో మాత్రం భారత్కు అర్థం కావడం లేదు.