'అదో అంద పరవాయ్ పోల' సినిమా షూటింగ్ లో భాగంగా ఓ యాక్షన్ సన్నివేశంలో నటిస్తుండగా అమలాపాల్ గాయపడింది. ఆమె మణికట్టు ట్విస్ట్ అయింది, దీంతో ఆ ప్రాంతంలో ఉండే లిగమెంట్ చిట్లింది. అయితే, ఇది చిన్న గాయమే అని భావించిన ఆమె షూటింగ్ ను కొనసాగించింది. అయితే, నొప్పి ఎక్కువ కావడంతో చిత్ర బృందం ఆమెను ఆసుపత్రికి తరలించింది. కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు ఆమెకు సూచించారు. చేతికి కట్టు కట్టుకుని ఉన్న ఫొటోను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకోగా, ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.