2019లో మోదీ ప్రధాని అయ్యే అవకాశమే లేదంటున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. హైదరాబాద్‌లో రెండో రోజు పర్యటిస్తున్న రాహుల్ ముందుగా కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీల అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం పత్రికలు, టీవీ ఛానెళ్ల ఎడిటర్లతో సమావేశమయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయాలతో పాటూ కీలక అంశాలపై చర్చించగా.. రాహుల్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అసహనం రోజు రోజుకు పెరిగిపోతుందని వ్యాఖ్యానించారు రాహుల్. రైతుల ప్రయోజనాలకు కాపాడాల్సిన అవసరం ఉందని.. అలాగే నిరుద్యోగులకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో మోదీ ప్రధాని కావాలంటే ఎన్డీఏకు మెజార్టీ సీట్లు రావాలని.. కాని అధి అసాధ్యమన్నారు రాహుల్. మెజార్టీ రానప్పుడు మోదీ ప్రధాని కూడా కాలేరని వ్యాఖ్యానించారు. 2019లో తెలంగాణలో కూడా విజయం సాధిస్తామని.. ఏపీలోనూ పుంజుకుంటామన్నారు రాహుల్. రాష్ట్రాల్లో పొత్తులపై స్థానిక నేతలే నిర్ణయం తీసుకుంటారని.. భావ సారూప్యమున్న పార్టీలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. సమావేశంలో రాహుల్ గాంధీ పెళ్లి అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. దీనిపై స్పందించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడో తనకు పెళ్లైందని చమత్కరించారు. రాహుల్ యువ సీఈవోలతో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత గన్‌పార్క్ వరకు బస్సు యాత్ర నిర్వహించారు. అక్కడ తెలంగాణ అమరవీరులకు రాహుల్ నివాళులు అర్పించారు. సాయంత్రం నాలుగున్నరకు సరూర్ నగర్ స్టేడియానికి బస్సు యాత్ర మొదలైంది. ఐదున్నర గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో విద్యార్థి నిరుద్యోగ గర్జనలో రాహుల్ పాల్గొని ప్రసంగించి. ...మంగళవారం రాత్రి ఆయన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు