YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

అస్సాంలో రూ. 3,400 కోట్ల ఐ.ఓ.సి పెట్టుబడి

అస్సాంలో రూ. 3,400 కోట్ల ఐ.ఓ.సి పెట్టుబడి

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐ.ఓ.సి) వచ్చే ఐదేళ్ళలో తన కార్యకలాపాలు విస్తరించుకునేందుకు అస్సాంలో రూ. 3,400 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దానిలో భాగంగా కొత్త యూనిట్లు నెలకొల్పడంతోపాటు, ఇప్పటికే ఉన్నవాటిని ఉన్నతపరచనుందని ఐ.ఓ.సి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపంకర్ చెప్పారు. ఈ మేరకు అస్సాం ప్రభుత్వంతో ఒక అవగాహనా పత్రంపై కంపెనీ సంతకాలు చేయనుంది. ‘ప్రయోజనదాయక అస్సాం-గ్లోబల్ ఇన్వెస్టర్ల శిఖరాగ్ర సదస్సు 2018’ సందర్భంగా ఈ పని పూర్తి కానుంది. ఈ రెండు రోజుల సమావేశాలు శనివారం ప్రారంభవుయ్యాయి. అస్సాంలో పెట్టుబడులకు నిధులు సమకూర్చేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపిందని, పనులలో పురోగతిని ఆధారం చేసుకుని భవిష్యత్తులో ఆ మొత్తం ఇంకా పెరగవచ్చని దీపంకర్ చెప్పారు. ‘‘ఇందులో అధిక భాగం చమురు శుద్ధి సామర్థ్యాల విస్తరణకు పోతుంది. ఇంధన నాణ్యతను మెరుగుపరిచేందుకు, బి.ఎస్.-6 నిబంధనలు పాటించే ఇంధనాన్ని తయారు చేసేందుకు, కొత్త యూనిట్లను జోడించనున్నాం. ఉన్నవాటిని ఉన్నతపరచనున్నాం’’ అని దీపంకర్ చెప్పారు.
ఉత్తర గువాహటి, సిల్చార్, మీర్జాలలో ఉన్న ఎల్.పి.జి. బాట్లింగ్ ప్లాంట్ల సామర్థ్యాలను కూడా కంపెనీ పెంచనుంది. ‘‘బరాక్ లోయ, దిగ్బాయ్ వంటి ప్రదేశాలలో పెట్రోలియం నిల్వల సామర్థ్యాలను కూడా పెంచుతున్నాం. బరాక్ లోయలో కొత్త డిపోను నెలకొల్పుతున్నాం. దానికి రైలుమార్గ సదుపాయం, పైపులైన్ కనెక్టివిటీ కల్పిస్తాం’’ అని ఆయన తెలిపారు.  ఈ ప్రాజెక్టు కింద, గువాహటిలోని బెట్‌కూచి, లండింగ్, మిస్సావురిలలో ఉన్న ఐ.ఓ.సి. డిపోల సామర్థ్యాన్ని విస్తరిస్తామని ఆయన చెప్పారు. ‘‘ఈ అవగాహనా పత్రం కింద కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరికొన్ని త్వరలోనే ప్రారంభమవుతాయి. ఈ ప్రాజెక్టులు ఉద్యోగాల సృష్టికి కూడా సహాయపడతాయి. ఈ ఉద్యోగాల్లో చాలా భాగం కాంట్రాక్టు ద్వారా పరోక్ష మార్గంలో లభించవచ్చు’’ అని దీపంకర్ చెప్పారు.  

Related Posts