తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్ మైదానంలో టిటిడి కార్యనిర్వహణాధికారి అనిల్కుమార్ సింఘాల్ జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవిఎస్వో నందీశ్వర్రావు పరేడ్ కమాండర్గా వ్యవహరించారు. అనంతరం టిటిడి ఈవో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమసేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 21 మంది అధికారులు, 136 మంది ఉద్యోగులు, 34 మంది ఈ ఏడాది పదవి విరమణ పొందే ఉద్యోగులకు ఐదు గ్రాముల వెండి డాలర్, ప్రశంసాపత్రాలు అందజేశారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థినులచే జాతీయగీతం, స్వచ్ఛబారత్పై కూచిపూడి నృత్యం, శ్రీ పద్మావతి మహిళ డిగ్రీ, పిజి కళాశాల విద్యార్థినులు ''తొలిపొద్దు వెలుగులు'', ఎస్జిఎస్ హైస్కూల్ విద్యార్థులు '' వృక్షో రక్షతి రక్షిత: '' దాస భక్తి గీతాలు ఆకట్టుకుంది. ఎస్వీ ఆర్ట్స్, ఎస్వీ వెటర్నరి కళాశాల ఎన్సిసి విద్యార్ధిని విద్యార్థుల గుర్రపుస్వారీ అలరించింది.