మిర్చి ఘా టెక్కింది. సామాన్యుడు కొనలేని స్థాయికి ధర పెరిగింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ధరలో విపరీతమైన తేడా కనిపిస్తోంది. ప్రస్తు తం రాష్ట్రంలో సగటున కిలోకు రూ.104 అధికారికంగా నమోదు కాగా గతేడాది రూ. 44 ఉందని పౌరసరఫరాలశాఖ వెల్లడించింది. బహిరంగ మార్కెట్‌లో మిర్చి ధర మేలు రకం కిలోకు రూ.130 నుంచి 150 వరకుం ది. ఇందులో మూడు గ్రేడులను వ్యాపారులు విక్రయిస్తున్నారు. కూరగాయాలు ధరలు మాత్రం ఆకాశనంటుతున్నాయి. రైతు బజార్లలో కంటే బహిరంగ మార్కెట్లల్లో విపరీతంగా ధరలున్నాయి. గతేడాదితో ఏ మాత్రం సంబంధం లేకుండా ధరలు పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం బహిరంగ కిలో ఒకటింటికి మార్కెట్‌లో టమోట 30 రూపాయాలు కాగా క్వాలీప్లవర్, బెండకాయ, దొండకాయలు 40 రూపాయలుగా ఉంది. ఇక టమోట 30 రూపాయలుండగా క్యారెట్ మాత్రం 60, ఆలుగడ్డ 25, బీరకాయ 40, చిక్కుడుకాయ 40 రూపాయలుగా ఉంది. కానీ అధికారిక లెక్కలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. గతేడాదితో పోల్చితే పెరిగిన ధరల్లో మార్పులు లేవని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఆలుగడ్డ 16, టమోట 20, బెండకాయ 30, క్యాబేటి 28 రూపాయలుగా ఉన్నాయి. గతేడాది వీటి ధరలు రూ.20, 17, 25, 26 నమోదైనట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి.మేలు రకం, సెకండ్ గ్రేడ్ తో పాటు తాళ్లుగా ఉండే మిర్చి ధర రూ.110 నుంచి రూ.150 వరకు బహిరంగ మార్కెట్ లో లభిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే అధికారికంగా రాష్ట్రంలో 73.43 శాతం మేరకు పెరిగిందని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కానీ బహిరంగ మార్కెట్‌లో మాత్రం నూటికి నూరు శాతం మేరకు పెరిగిందని అంచనాలు కూడా లేకపోలేదు.ఉల్లితో పాటు వంట నూనెలు ధరలు కొంత మేరకు పెరిగాయి. పెద్దగా ప్రభావితం చేయకపోయినా ధరల్లో మాత్రం కొంత వరకు తేడాలున్నాయి. ఉల్లి ప్రస్తుతం మార్కెట్‌లో రూ.13.74లుంటే గతేడాది అధికారిక లెక్కల ప్రకారం రూ.10.59గా ఉంది. రూ.3.15 పెరిగి 29.78 నమోదు చేసుకుంది. వంట నూనెలు ధరలు సైతం ఇదే విధంగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే కొన్నింటిని ధరలు తగ్గుముఖం పట్టాయి. తగ్గినా వాటి ధరలు పెద్దగా మార్పులు లేవు. ప్రధానంగా బియ్యం, పప్పు ధాన్యాలను తీసుకుంటే గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది కొంత మేరకు తగ్గుముఖం పట్టాయి. తగ్గిన ధర రెండు నుంచి మూడు రూపాయలకు మించకపోవడం విశేషం.క్వాలిటి బియ్యం ప్రస్తుతం మార్కెట్‌లో రూ.39.71 ఉంటే గతేడాది రూ.40.51గా ఉండేది. అదే విధంగా ఫైన్ రైస్ ప్రస్తుతం రూ.26.85 ఉంటే గతంలో రూ.27.07గా ఉందని అధికారిక లెక్కలున్నాయి. బహిరంగ మార్కెట్‌లో మాత్రం మేలు రకం రూ.50, సెకండ్ క్వాలిటీ ధర రూ.45గా ఉన్నాయి. పప్పుధాన్యాల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. గ్రేడ్ 1 కందులు ప్రస్తుతం మార్కెట్‌లో రూ.71.31 ఉంటే, గ్రేడ్ 2 రూ.63.62గా ఉంది. గతేడాది గ్రేడ్ 1 రూ.72.83 కాగా గ్రేడ్ 2 రూ.63.66గా ఉన్నాయని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో మాత్రం మేలు రకం కందుల ధర రూ. 85లు ఉండే సెకండ్ గ్రేడ్ క్వాలిటీలో రూ.78 ఉంది.