కేరళను వానలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటివరకు 79 మృతి చెందారు. రెండు రోజుల్లోనే 40 మందికిపైగా మృత్యువాతపడ్డారు. పాలక్కడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కేరళలోని 14 జిల్లాల్లో వాతావరణశాఖ అధికారులు అత్యంత ప్రమాదకరస్థాయి హెచ్చరికలు జారీ చేశారు. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వరద నీరు భారీగా మూసివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో మెట్రో, రైళ్ల సేవలను కూడా రద్దు చేశారు. కలమ్‌సేరి నగరాన్ని వరదనీరు చుట్టుముట్టింది. నగరంలో వీధుల్లోకి వరదనీరు చొచ్చుకు రావడంతో జనావాసాలు ముంపులో చిక్కుకున్నాయి. కేరళలోని పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పంబానది ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా, శబరిమలలోని ఉపాలయాలు నీట మునిగాయి. పంబ వద్ద నదిలో నీటిమట్టం 25 అడుగుల ఎత్తునకు చేరుకోవడంతో, కొండపైకి వెళ్లే దారి మూసుకుపోయింది. దీంతో భక్తులను కొండపైకి వెళ్లకుండా అధికారులు అడ్డుకుంటున్నారు. పంబలోని స్నాన ఘాట్లు, దాని పక్కనే ఉండే యాత్రికుల విశ్రాంతి భవనాలు, షెడ్లు తదితరాలన్నీ నీట మునిగాయి. పంబా నదికి నీరందించే కాక్కి రిజర్వాయర్, పంబా రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. ఎగువన కొండల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.ఎనిమిది రోజులుగా వరుణుడు కేరళపై తన ప్రకోపాన్ని చూపుతున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు ఇప్పటివరకు 79 మృతి చెందారు. రెండు రోజుల్లోనే 40 మందికిపైగా మృత్యువాతపడ్డారు. పాలక్కడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కేరళలోని 14 జిల్లాల్లో వాతావరణశాఖ అధికారులు అత్యంత ప్రమాదకరస్థాయి హెచ్చరికలు జారీ చేశారు. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వరద నీరు భారీగా చేరడతో శనివారం మధ్యాహ్నం వరకూ దాన్ని మూసివేసినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో మెట్రో, రైళ్ల సేవలను కూడా రద్దు చేశారు. కలమ్‌సేరి నగరాన్ని వరదనీరు చుట్టుముట్టింది.తిరువనంతపురం నగరంలో వీధుల్లోకి వరదనీరు చొచ్చుకు రావడంతో జనావాసాలు ముంపులో చిక్కుకున్నాయి. మరోవైపు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న కేరళకు అదనపు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడి అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేరళకు అవసరమైన సాయాన్ని అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్ చెప్పారు. అలాగే త్రివిధ దళాలు సైతం రంగంలోకి దిగాయి. ముల్లపెరియార్ రిజర్వాయర్‌లో నీటి మట్టం పెరుగుతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. కేంద్ర జల సంఘం ఛైర్మన్ పరిస్థితి సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలకు అదనపు సిబ్బందితోపాటు హెలికాప్టర్లు పంపాలని ఎన్డీఆర్ఎఫ్ దళాలు పేర్కొన్నాయి. కేరళలో సహాయ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని కేంద్రం ఆదేశించింది. ప్రధాని ఆదేశాలతో క్యాబినెట్ సెక్రెటరీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.