
మేడారం జాతర నేటితో ముగియనుంది. ఈ క్రమంలో సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. గద్దెల వద్దకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు సమర్పించుకుంటున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జాతరలో చివరి రోజున సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజు వనప్రవేశం చేయనున్నారు. దీంతో జాతర ముగిసినట్లు పూజారులు ప్రకటించనున్నారు.