YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సీఎం ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగులపై చిన్న చూపు

సీఎం ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగులపై చిన్న చూపు

విజయనగరం జిల్లాలో ఎనిమిది ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. విజయనగరంలోని వీటీ అగ్రహారం, పూల్‌బాగ్‌ కాలనీ, రాజీవ్‌నగర్‌ కాలనీ, లంకాపట్నంల్లో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అదే విధంగా సాలూరులో ఒకటి, బొబ్బిలిలో 2, పార్వతీపురంలో ఒకటి చొప్పన ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రతీ ఆరోగ్య కేంద్రంలోను ఇద్దరు చొప్పన 16 మంది ఏఎన్‌ఎంలు పని చేస్తున్నారు.వారంతా ఒకే రకం విధులు నిర్వహిస్తారు. విద్యార్హత కూడా ఒక్కటే.. అయినా జీతాల్లో మాత్రం చెప్పలేనంత వ్యత్యాసం.  ఒకరు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేసే 2 ఏఎన్‌ఎంలు కాగా, మరొకరు ముఖ్యమంత్రి ఆరోగ్య  కేంద్రాల్లో పనిచేసే ఏఎన్‌ఎంలు. జీతాల్లో వ్యత్యాసం ఉండడంతో  ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఏఎన్‌ఎంలు  ఆవేదన చెందుతున్నారు. ఒకే క్యాడర్‌ గల వారికి ప్రభుత్వం జీతాల్లో వ్యత్యాసం చూపడం ఏంటని? ప్రశ్నిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 400కు పైగా 2వ ఏఎన్‌ఎంలు పని చేస్తున్నారు. వీరికి ఒకరికి నెలకు రూ.18,970 జీతం. వీరు గ్రామాల్లో పిల్లలకు, గర్భిణులకు టీకాలు వేయించడం, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకునేలా మహిళలను ప్రోత్సహించడం, గర్భిణులకు వైద్య తనిఖీలు చేయించడం వంటి విధులు నిర్వహిస్తారు. వీరికి నెలకు ఒకరికి జీతం రూ.11,200 ఇస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేసే వారికి, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వారికి మధ్య వ్యత్యాసం రూ.6,770 ఉంది. సుమారు రూ.7 వేలు వరకు ఇద్దరి మధ్య వ్యత్యాసం ఉండడంతో వారు చేసిన విధులే మేము చేసినప్పటికి మాకు మాత్రం జీతం తక్కువగా ఇస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఏఎన్‌ఎంలు  వాపోతున్నారు.

Related Posts