రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించేది లేదు..అన్న నోటి నుంచే.. తన కుమారుడిని సైలెంట్‌గా తెరమీదికి తెచ్చా రు టీడీపీ అధినేత చంద్రబాబు! ఒకప్పుడు రాజకీయ వారసులకు కేరాఫ్‌గా ఉన్న కాంగ్రెస్‌ను మించిపోయేలా ఇప్పుడు ఏపీలో అధికార టీడీపీలో వారసుల సంఖ్య భారీ సంఖ్యలోనే ఉండడం గమనార్హం. దాదాపు 30 ఏళ్లుగా రాజకీయా ల్లో చక్రం తిప్పిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు తమ వారసులను నాయకులుగా చూసుకుని మురిసిపోవాలని ఉవ్విళ్లూరుతున్నా రు. ఈ క్రమంలో అక్కడా ఇక్కడ అనే తేడా లేకుండా రాష్ట్రంలోని సిక్కోలు నుంచి అనంతపురం వరకు కూడా టీడీపీ నాయకులు వారి వారి వారసులను రంగ ప్రవేశం చేయించేందుకు రెడీ అయ్యారు. అది కూడా పార్టీ పదవులతో కాకుండా ఏకంగా ప్రజాక్షేత్రంలోనే దింపేందుకు వారు సిద్ధం కావడం గమనార్హం.ఈ పరంపరలో టీడీపీ సీనియర్ల జాబితా భారీగానే ఉంది. తన కుమారుడిని మంత్రిని చేయడం ద్వారా వారసత్వ రాజకీ యాలను ప్రోత్సహించక తప్పని పరిస్థితి ఇప్పుడు చంద్రబాబుకు ఏర్పడడం గమనార్హం. విషయంలోకి వెళ్తే.. ఎమ్మెల్యేలుగా ఉన్నవారి నుంచి బరిలోకి దిగుతున్న వారసులను పక్కన పెడితే.. ప్రస్తుతం మంత్రులుగా చంద్రబాబు కేబినెట్‌లో చక్రం తిప్పుతున్న వారి వారసులు ప్రధానంగా చర్చకు వస్తున్నారు. వీరిలో ప్రథమంగా తెరపైకి కనిపిస్తు న్న వారు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. ఈయన దాదాపు 35 ఏళ్లకు పైగా టీడీపీలో ఉన్నారు. వివిధ పదవులు అనుభవించారు. వయో వృద్ధుడు కావడం, విశ్రాంతి కోరుకుంటున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఈయన తన కుమారుడు కేఈ శ్యాంబాబును రంగంలోకి దింపాలని కోరుతున్నారు.తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పత్తికొండ నుంచి శ్యాంబాబుకు టికెట్ ఇవ్వాలని ఇప్పటికే సీఎం చంద్రబాబుకు ఆయన విజ్ఞప్తి కూడా చేశారు. దీనికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరోసీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఈయన కూడా వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు చింతకాలయల విజయ్‌ను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. అయితే, అయ్యన్న మాత్రం బరి నుంచి తప్పుకొనేది లేదని సమాచారం. తాను, తన కుమారుడు ఇద్దరూ కూడా ఎన్నికల్లో పోటీకి సిద్ధమేనని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఒకవేళ.. సమీకరణలు కుదరని పక్షంలో తన కుమారుడికైనా టికెట్ ఇప్పించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.అయితే వచ్చే ఎన్నికలు కీలకం కావడంతో చంద్రబాబు అయ్యన్ను తప్పించే రిస్క్ చేస్తారా ? అన్నది చూడాలి. ఇదే వరుసలో అనంతపురానికి చెందిన అతిపెద్ద రాజకీయ కుటుంబం పరిటాల ఫ్యామిలీ నుంచి రవి వారసుడిగా ఆయన పెద్ద కుమారుడు శ్రీరామ్ రంగ ప్రవేశం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం ఈయన తల్లి, పరిటాల సునీత మంత్రిగా కొనసాగుతున్నారు. బలమైన రాజకీయ వారసత్వం ఉన్న కుటుంబం కావడంతో శ్రీరామ్‌ను కాదనలేని పరిస్థితి ఉంది. సునీత రాఫ్తాడు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వీళ్లకు పెనుగొండలోనూ పట్టుంది. సునీత రెండు సీట్ల కోసం ట్రై చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబుకు ఓ వినతి పత్రం కూడా ఆమె సమర్పించారు. మరి బాబు ఏం చేస్తారో ? చూడాలి.అదేవిధంగా ప్రకాశం జిల్లాకు చెందిన మరో టీడీపీ దిగ్గజం మంత్రి శిద్దా రాఘవరావు కూడా తన వారసుడిని వచ్చే ఎన్నికల్లో రంగ ప్రవేశం చేయించాలని చూస్తున్నారు. శిద్దా తనయుడు సుధీర్‌బాబు ఇప్పటికే దర్శి నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో బాబుకు ఈ ఫ్యామిలీపై ఉన్న నమ్మకంతో రెండు సీట్లు ఇవ్వవచ్చని టాక్ నడుస్తోంది. టీడీపీకి బలమైన ఓ ఎంపీ సీటుతో పాటు మరో అసెంబ్లీ సీటు ఈ ఫ్యామిలీకి ఇస్తారని అంటున్నారు. సుధీర్ అసెంబ్లీకి పోటీ చేయవచ్చని జిల్లాలో ఊహాగానాలు నడుస్తున్నాయి. క్లీన్ ఇమేజ్ ఉన్న సుధీర్ రంగంలోకి దిగితే.. గెలుపు ఖాయమనే వ్యాఖ్యలు కూడా జోరుగా వినిపిస్తుండడం గమనార్హం.ఇక, ఆర్థికంగా ఈ కుటుంబానికి ఇబ్బంది లేకపోవడంతో వైసీపీ అభ్యర్థికి చుక్కలు చూపిస్తారని అంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సుధీర్ పేరు పశ్చిమ ప్రకాశంలో ఓ కీలక నియోజకవర్గం రేసులో కూడా వినపడుతోంది. అదేసమయంలో మరో మంత్రి నెల్లూరుకు చెందిన సీనియర్ మోస్ట్ నేత మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా వచ్చ ఎన్నికల్లో తన తనయుడిని నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని ఈయన కూడా చంద్రబాబు చెవిలో వేశారట! మరి దీనికి చంద్రబాబు ఎలా రియార్ట్ అవుతారో చూడాలి.