ఏపీలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీల పొత్తును తెలుగుదేశం అధికారిక పత్రికలే ధ్రువీకరిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని భుజాన మోస్తున్న తెలుగుదేశం పత్రికలు పొత్తు ఉండబోతున్న విషయాన్ని కూడా చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఇప్పటికే చాలా దగ్గరైపోయిన సంగతి తెలిసిందే. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవం దగ్గర నుంచి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల బంధం బయటపడుతూ వస్తోంది. డైరెక్టుగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతోనే చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యాడప్పుడు.ఇక ఇటీవల హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు తెలుగుదేశంపార్టీ వాళ్లే దగ్గరున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోడలే రాహుల్ తో సమావేశానికి హాజరైంది. అలాగే ఆ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ప్రముఖులు మెరిశారు. జేసీ పవన్ రెడ్డి, టీజీ భరత్ వంటి తెలుగుదేశం పార్టీ యువనేతలు రాహుల్ తో సమావేశం అయ్యారు. వీళ్లంతా ‘వ్యాపారస్తుల’ హోదాలో రాహుల్‌తో సమావేశం అయినా.. ఒకవేళ బీజేపీతో టీడీపీ క్లోజ్‌గా ఉండుంటే.. వీళ్లెవ్వరూ అటువైపు చూసే వాళ్లు కాదనేది బహిరంగ సత్యంఈ మీట్లో రాహుల్ గాంధీ స్వయంగా చెప్పారట.. ఏపీలో పొత్తులు ఉంటాయని. ఆ పొత్తు ఎవరితోనే డైరెక్టుగా చెప్పలేదు కానీ.. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమే. ఇప్పటికే తెలంగాణలో ఈ రెండు పార్టీల మధ్య ఒడంబడిక ఖాయం అయినట్టే. ఇక ఏపీలోనూ ఆ ముచ్చట ఉండబోతోంది.కాంగ్రెస్ వ్యతిరేకతే ఊపిరిగా ఆరంభం అయిన తెలుగుదేశం పార్టీ చివరకు అదే పార్టీతో చేతులు కలుపుతోంది.