రెండు టెస్టుల్లో ఓటమి.. లార్డ్స్‌లో అయితే మరీ ఘోర పరాభవం.. దారుణమైన ఫామ్‌లో బ్యాట్స్‌మెన్.. బౌలింగూ కూడా గొప్పగా ఏమీ లేదు.. అన్నీ ప్రతికూలతలే. అన్నీ సవాళ్లే. సిరీస్ ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా కీలక సమరానికి సన్నద్ధమైంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు హాట్‌ఫేవరెట్‌గా పరిగణించిన టీమిండియా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలతో 5 టెస్టుల సిరీస్‌ను చేజార్చుకునే స్థితిలో నిలిచింది. తొలి రెండు టెస్టుల్లో ఆతిథ్య ఇంగ్లండ్ బౌలర్లకు తలవంచిన టీమిండియా.. సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ రోజు నుంచి ట్రెంట్‌బ్రి డ్జ్‌లో మొదలయ్యే మూడో టెస్టులో తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. సిరీస్ లో 0-2తో వెనుకబడిన నేపథ్యంలో అమీతుమీకి కోహ్లీసేన సిద్ధమైంది. కాగా, ఎన్నో రోజులుగా టెస్టు ల్లో అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న 20 ఏళ్ల వికెట్ కీపర్ రిషభ్ పంత్ నిరీక్షణకు తెరపడే అవకాశం ఉంది.