YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం

మేలుకోవటం మేలు.

 మేలుకోవటం మేలు.

ఆలస్యంగా నిద్ర లేవటమో, బడి బస్సుకు సమయం కావటమో.. కారణమేదైనా పిల్లలు తరచుగా టిఫిన్‌ (అల్పాహారం) చేయటం మానేస్తుంటారు. పెద్దవాళ్లు కూడా హడావుడిలో దీన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే ఇది పిల్లల ఎదుగుదలను గణనీయంగా దెబ్బతీస్తుంది. తరచుగా అల్పాహారం మానేసే పిల్లల్లో ఫోలేట్‌, క్యాల్షియం, ఐరన్‌, అయోడిన్‌ వంటి పోషకాలు లోపిస్తున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువగా టిఫిన్‌ చేయటం మానేస్తుండటం గమనార్హం. పోషణలోపంతో పిల్లల ఎదుగుదల దెబ్బతింటుంది. ఇది మున్ముందు మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మేలుకోవటం మేలు.

Related Posts