కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ లో శనివారం ఉదయం జరిగిన రాహుల్ గాంధీ కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు రాష్ట్రాల పిసిసిలు ఛీఫ్ లు ,సిఎల్పీ నేతలు, అశోక్ గెహ్లాట్, గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ సహా కీలక నేతలు పాల్గోన్నారు. రాఫెల్ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, కేరళ ప్రజలను ఆదుకోవడంపై కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేసారు. ఏపీసీసీ ఛీనఫ్ రఘువీరా రెడ్డి మాట్లాడుతే రాఫెల్ యుద్ద విమానాల కొనుగోళ్ళలో జరిగిన అవినీతి ప్రజలకు వివరిస్తాం. రాఫెల్ కుంభకోణంలో మోడీ పెద్ద దోషి. ప్రధాని మోడీ పెద్ద దోపిడీ దారుడని ఆరోపించారు. ఐదు వందలకు పై విలువ చేసే విమానాలను బిజెపి ప్రభుత్వం 1600 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రజాధనాన్ని మోడీ దోచుకున్నారు. రిలయన్స్ కంపెనీకి డబ్బును దోచిపెట్టారు. దేశ రక్షణను ఫణంగా పెట్టారు. కాంగ్రెస్ రఫెల్ కుంభకోణాన్నిబయటపెట్టినా ప్రధాని మాట్లాడటం లేదు. రాఫెల్ కుంభకోణం పై విచారణకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని అయన విమర్శించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడం లేదు. బిజెపి అవినీతిని ఏవిధంగా బయటపెట్టాలో కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఏపీలో జిల్లా స్ధాయి సమావేశాలు, ఓరియెంటేషన్ సమావేశాలు, బూత్ కమిటీల ఏర్పాటు, సెప్టెంబరు 15-25 వరకు నియోజకవర్గ స్ధాయిలో సమావేశాలు వుంటాయని అయన అన్నారు. అక్టోబర్ లో రాఫెల్ కుంభకోణంపై ఏపీలో కోటి కుటుంబాలకు కరపత్రాలను పంచుతామని అయన అన్నారు.
రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. దానికి ఉదహరణే కేరళ కు చేస్తున్న సాయం. వరదలొచ్చి కొట్టుకుపోతే ముష్టి వేసినట్లు ఒకసారి 100 కోట్లు, మరోసారి 500 కోట్లు ఇచ్చారని అయన ఆరో్పించారు.