YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ అవినీతి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ అవినీతి      తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ అవినీతి చోటుచేసుకుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఢిల్లీ లో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతిపై సుదీర్ఘంగా సమావేశంలో చర్చించామని వెల్లడించారు. వీటి కొనుగోలులో రూ.41వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఒక్కో విమానం రూ.526 కోట్లకు యూపీఏ హయాంలో ఒప్పందం కుదరగా.. ఒక్కో విమానాన్ని రూ.1600 కోట్లకు కొనేందుకు ప్రధాని మోదీ ఒప్పందం కుదుర్చుకున్నారని ఉత్తమ్‌ ఆరోపించారు. మొత్తం 36 విమానాలకు రూ.41వేల కోట్లు అధికంగా ఖర్చు చేశారని ఆరోపించారు.వరద బీభత్సంతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రం గురించి కూడా సమావేశంలో చర్చించామని ఉత్తమ్‌ చెప్పారు. కాంగ్రెస్‌కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేరళకు ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. తెలంగాణ పీసీసీ తరఫున కూడా సాయం చేస్తామని వివరించారు. కేరద వరదలను జాతీయ విపత్తులగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

Related Posts