ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షుడిగా విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబును మరోసారి కొనసాగిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించుకోవాలని సూచించింది. రాబోయే పది, పదిహేను రోజుల్లో ఏపీ భాజపా కార్యవర్గం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు తెదేపా-భాజపా నేతల మధ్య కొన్ని రోజులుగా జరుగుతున్న మాటలయుద్ధంపైనా అధిష్ఠానం స్పందించింది. మిత్రపక్షం తెదేపాపై ఇష్టం వచ్చినట్లు మాట్లడవద్దని నేతలకు, పార్టీ ఆర్గనైజేషనల్ కార్యదర్శిని హెచ్చరించినట్లు తెలిసింది. గ్రూపులు ప్రోత్సహించొద్దని, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని హితవు పలికింది. పార్టీ విధానాలకు భిన్నంగా వెళ్తే చర్యలకు వెనుకాడనని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హెచ్చరించినట్లు సమాచారం.