తూర్పుగోదావరి జిల్లా రాజమహేంధ్రవరం పరిసర ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ కొనసాగుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. భద్రాచలం సమీప గోదావరి 44.6 నీటి మట్టం కాగా, రంపచోడవరం దేవీపట్నం గోదావరి 47.2 నీటి మట్టంగా కొనసాగుతుందని చెప్పారు. అయితే రాజమహేంధ్రవరం గోదావరి నీటి మట్టం 14.6 గా నమోదై కాస్త తగ్గుముఖంగా ఉందని చెప్పారు. ముఖ్యంగా చోడవరంలో రెండు గ్రామాల్లో వరద నీరు చొచ్చుకొని పోయి గ్రామస్ధులను ఇబ్బందులకు గురి చేసిందని చెప్పారు. అలాంటి ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిస్ధితులపై తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.