
తెలంగాణ రాష్ట్ర పండగ, ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ముగిసింది. మేడారం గద్దెల పైనుంచి సమ్మక్క-సారలమ్మ వనప్రవేశం చేశారు. గిరిజన సంప్రదాయం ప్రకారం అత్యంత వైభవంగా మేడారం జాతర ముగిసింది. ప్రధాన పూజారుల సమక్షంలో సమ్మక్క-సారలమ్మలు వనప్రవేశం చేశారు. మూడు రోజులుగా మొక్కులు అందుకున్న వనదేవతల వనప్రవేశంతో జాతరలో చివరి ఘట్టం ముగిసింది. మేడరాం అమ్మవార్లను 1.25 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రోజున సమ్మక్క-సారలమ్మను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్, ఛత్తీస్‌ఘడ్ సీఎం రమణ్‌సింగ్ దర్శించుకుని మొక్కులు సమర్పించిన విషయం తెలిసిందే.
విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు..
జాతరను ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా అత్యంత భక్తి, శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేసినందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి భక్తులు, అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు తల్లుల మీద ఉన్న భక్తితో భక్తులు సంయమనం పాటించి సహకరించినందుకు భక్త కోటికి ఈ సందర్భంగా కడియం కృతజ్ణతలు తెలిపారు.