'ఆర్ఎక్స్ 100'తో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై ఈమె సంచలన వ్యాఖ్యలు చేసింది. తన చిత్రంలో బోల్డ్ పాత్రలో కనిపించినందువల్ల, తాను అటువంటి క్యారెక్టర్ అమ్మాయినే అనుకున్నారేమోనని చెప్పుకొచ్చిన పాయల్, నాలుగు రోజుల క్రితం తనను కాంప్రమైజ్ కావాలని ఒకరు ప్రపోజ్ చేశారని చెప్పింది. ఈ మాటలను తప్పకుండా ప్రచురించాలని చెబుతూ, "ఐయామ్ రియల్లీ షాక్డ్. ఇటువంటి కోరికతో ఒకరు నా ముందుకు వచ్చారు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. నేను కాంప్రమైజ్ అయి ఈ స్థాయికి రాలేదు. నేను టాలెంట్ తోనే వచ్చాను. నేను చెప్పదలచుకున్నది అదే" అని చెప్పింది.