cv
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా తొణికిసలాడుతున్నాయి.ఇప్పటికే ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద ప్రవాహానికి ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల,తుంగభద్ర తో పాటు శ్రీశైలం ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయి గరిష్ట నీటి మట్టానికి చేరుకున్నాయి. శ్రీశైలం నుండి ఎనిమిది రేడియల్ క్రస్ట్ గేట్లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా రెండు లక్షల క్యూసెక్కుల పైగా నీటి ప్రవాహం నాగార్జునసాగర్ జలాశయానికి చేరుతుంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 కాగా ప్రస్తుతం 545 అడుగులకు నీరు చేరింది. దీంతో నల్గొండ,ఖమ్మం జిల్లా ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా వరద కొనసాగితే పది రోజుల్లో సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.