నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు,వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు. ముఖ్యమత్రి మాట్లాడుతూ భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం అయ్యింది. ఇదొక జాతీయ విపత్తు. సామాజిక బాధ్యతతో ముందుకొచ్చి అందరూ ఆదుకోవాలి. మన రాష్ట్రంలో కూడా భారీవర్షాలు,వరద ఉధృతి తీవ్రంగా ఉంది. ప్రకృతి విపత్తులను నిరోధించలేం కాని, తీవ్రతను ముందే అంచనావేసి ప్రాణ, ఆస్తినష్టం నివారించగలమని అన్నారు. విపత్తులలో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రభుత్వ యంత్రాంగం పూర్తి బాధ్యతతో వ్యవహరించాలి. అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరూ క్షేత్రస్థాయిలో ఉండాలి. వరద బాధిత ప్రాంతాలలో పర్యటించాలి. బాధిత ప్రజానీకానికి అండగా ఉండాలి. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. ఒక్కరోజు 13లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయి. భూగర్భ జలాలు, ఉపరితల జలాలు సద్వినియోగం చేసుకోవాలి. కరవు అనేది శాశ్వతంగా తొలగిపోవాలి. భారీ వర్షాల వల్ల జిల్లాలలో పంటనష్టంపై ముఖ్యమంత్రి ఆరా తీసారు. తెగుళ్లు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతాంగానికి అందుబాటులో ఉండాలి. రియల్ టైమ్ ఫ్లడ్ మేనేజిమెంట్ జరగాలి. సకాలంలో వరద ప్రవాహ నిర్వహణ జరగాలి. ఎర్రకాలువ, బుడమేరు, తమ్మిలేరు వరదలపై నిశితంగా దృష్టిపెట్టాలని సూచించారు. ఎక్కడా పంటలు మునగకుండా శ్రద్దపెట్టాలి, మిషన్ అంత్యోదయలో మన రాష్ట్రమే ముందుంది. రాష్ట్రానికి చెందిన 2,500 పంచాయితీలు ముందంజలో ఉన్నాయి. తొలి 120 పంచాయితీలలో 40మనవవేనని అయన అన్నారు.