భారీ వర్షాలతో రాజమండ్రిలో గోదావరి నది ప్రమాదభరితంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు బ్యారేటీ నీటిమట్టం 13.75 అడుగులకు చేరుకుంది. అధికారులు 13 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దాదాపు 1000 మందికి పునరావాస కేంద్రాలకు తరలించారు. 18 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.