కర్నూలు జిల్లా పరిషత్ హాలులో సోమవారం జరిగిన రుణ ఉపశమన అర్హత పరిష్కార వేదిక భేటీల డిప్యూటీ సీఎం కేఈ క్రిష్ణమూర్తి, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, ఎమ్మెల్యే బిసి జనార్ధన్ రెడ్డి, జెడ్పీ ఛైర్మన్ రాజశేఖర్, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పాల్గోన్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ఏపి దేశంలోనే ముందుంది. కేంద్రం మొక్కజొన్నలను ఒక టన్ను కూడ కొనలేదు. ప్రభుత్వమే కొనుగోలు చేసింది. బిజెపి పాలిత రాష్ట్రాల్లో కేంద్రం 70 శాతం ధాన్యం కొనుగోళ్లు చేసింది. కానీ ఏపిలో 20 శాతం కూడ కొనలేదని అన్నారు. బిజెపి నాయకులకు వ్యవసాయం అంటేనే తెలియదు. కేంద్రం రైతుల నుంచి ఎమ్ ఎస్ పి ధరలకన్నా పంటలను కొనాలి. అర్హులైన రైతులందరికీ రుణ విముక్తి వుంటుందని అయన అన్నారు. కరువు మండలాల్లో ఉచితంగా విత్తనాలు పంపిణీ చేస్తాం. నదులకు భారీగా నీళ్లు రావడాన్ని చూసి వైసీపీ జీర్ణించుకోలేక పోతుంది. పంటలు బాగా పండాలని టిడిపి అనుకుంటుంటే, రైతులకు కష్టాలు, ఓట్లు రావాలని ప్రతిపక్షం కోరుకుంటోందని అయన విమర్శించారు.